రాజాంను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:30 AM
రాజాం పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.
ఎమ్మెల్యే కోండ్రు
రాజాం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రాజాం పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. శ్యాంపురంలోని తన క్యాంపు కార్యాలయంలో రాజాం 32 వార్డుల కూటమి నేతలతో ఆయన శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వార్డుల వారీగా ఎన్నికల పరిస్థితులు, ప్రచార ప్రణాళికలు, తదితర అంశాలపై చర్చించారు. జనసేన పార్టీకి కేటాయించిన చైర్మన్ అభ్యర్థితో పాటు 32 వార్డుల్లో కూటమి తరపున బరిలో నిలవనున్న కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపు నిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజాం పట్టణం అభివృద్ధికి నోచుకోకుం డా నిర్లక్ష్యానికి గురైందని విమ ర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. ఈనెల 26న జరగనున్న పోలింగ్‌లో పట్టణ ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.