రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తాం
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:22 AM
మక్కువ రోడ్డు విస్తరణ, కాలువ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ప్రాంతీయ సూపరింటెండెంట్ కేవీఎస్‌ఎన్ కుమార్ తెలిపారు. శనివారం మక్కువలో 2.65 కోట్లతో జరుగుతున్న మెయిన్ రోడ్డువిస్తరణ, కాలువల పనులు పరిశీలించారు.
మక్కువ, జూలై 18(ఆంధ్రజ్యోతి): మక్కువ రోడ్డు విస్తరణ, కాలువ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ప్రాంతీయ సూపరింటెండెంట్ కేవీఎస్‌ఎన్ కుమార్ తెలిపారు. శనివారం మక్కువలో 2.65 కోట్లతో జరుగుతున్న మెయిన్ రోడ్డువిస్తరణ, కాలువల పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లా డుతూ మక్కువలో కాలువల నిర్మాణానికి 2.65 కోట్లు, రోడ్డు పనులకు 4 కోట్ల 70లక్షలు మంజూరయ్యాని తెలిపారు. మక్కువ మెయిన్‌రోడ్డులో ఎనిమిది కోట్లతో పనులు చేపట్టగా వచ్చే మార్చి నెలాఖరుకు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాలువల నిర్మాణం పూర్తికాగానే రోడ్డుపనులు ప్రారంభిస్తామని, నిధులవ్యయాన్ని బట్టి సెంటర్ లైటింగ్ ఏర్పాటుచేసేందుకు సమాలోచనలు చేస్తున్నామని తెలిపారు. సెంటర్ లైటింగ్‌కు రెండుపక్కలా రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని ఆయన ఐటీడీఏ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, డీఈఈ మణిరాజులకు ఆదేశించారు. స్థానిక మజ్జిగౌరమ్మ గుడి వద్ద నుంచి సువ ర్ణముఖి నది వరకు కాలువలు,రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలాప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆయనతోపాటు ఐటీడీఏ ఏఈ పీవీ సత్య నారాయణ, మక్కువ మండల టీడీపీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపా లనాయుడు, దాసరి కేశవ ఉన్నారు.