Share News

నగరం రూపురేఖలు మారుస్తాం

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:12 PM

నగరం రూపురేఖలు మార్చేలా అభివృద్ధి చేపట్టాలని వీఎంఆర్డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ పిలుపునిచ్చారు.

నగరం రూపురేఖలు మారుస్తాం
మాట్లాడుతున్న వీఎంఆర్డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, చిత్రంలో ఎమ్మెల్యే అదితి తదితరులు

- అభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తాం

-తొలి విడతగా రూ.10కోట్లు కేటాయింపు

- వీఎంఆర్డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌

విజయనగరం టౌన్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): నగరం రూపురేఖలు మార్చేలా అభివృద్ధి చేపట్టాలని వీఎంఆర్డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ పిలుపునిచ్చారు. విజయనగరంలోని ఆర్‌అండ్‌బీ కూడలి వద్ద వీఎంఆర్డీఏ నిధులు రూ.10కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబం ధించి స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితిగజపతిరాజుతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరాభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు వీఎంఆర్డీఏ సిద్ధంగా ఉందన్నారు. విజయనగరం కార్పొరేషన్‌ అభివృద్దే ధ్యేయంగా వీఎంఆర్డీఏ నిధులు కేటాయిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అదితిగజపతిరాజు కృషితో నగరంలోని అన్నివార్డుల్లోనూ రహదారులు, కాలువలు, కల్వర్టులు, విద్యుత్‌ స్తంభాలు వంటి అభివృద్ధి పనులకు తొలి విడతగా రూ.10కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. విజయనగరం లో స్థలం కేటాయిస్తే విశాఖలోని ఉడా పార్కు తరహాలో ఇక్కడకూడా పార్కును అభివృద్ధి చే యడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ తేజ్‌భరత్‌ మాట్లాడు తూ.. త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయానికి రహదారుల నిర్మాణం జోరుగా చేపడుతున్నట్లు తెలిపారు. విజయనగ రానికి రెండు ప్రధాన రహదారులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్పొరేషన్‌ను నెట్‌ జీరోగా, ప్రతీ శుక్రవారం నో వెహికల్‌ డేగా చేప ట్టేందుకు నిర్ణయించామని అన్నారు. ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ.. వీఎంఆర్డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ తేజ్‌భరత్‌ విజయనగరం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నా రని తెలిపారు. నిధులు కేటాయించిన అధికారు లకు కృతజ్ఞతలని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ బాలస్వామి, డీఈ శ్రీనివాస్‌, బీజేపీ నాయకులు రాజేష్‌ వర్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 11:12 PM