సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:37 AM
గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు, ఆర్డీవో రామ్మోహనరావు, డీడీ వో కిరణ్‌కుమార్ అన్నారు.
బొబ్బిలి రూరల్, జనవరి9 (ఆంధ్రజ్యోతి): గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు, ఆర్డీవో రామ్మోహనరావు, డీడీ వో కిరణ్‌కుమార్ అన్నారు. కృపావలసలో గురువారం ఐదు గ్రామాల గిరిజనులు సమా వేశమై తమకు జరుగుతున్న అన్యాయంపై ని రసన తెలిపిన నేపథ్యంతో కలెక్టర్ రామసుందర్ రెడ్డి స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు గిరిజన గ్రామాలకు చేరుకుని అక్కడ ప్రజలతో ప్రత్యేకంగా గ్రామసభ నిర్వ హించారు. గిరిజనుల ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో వారు గ్రామా లకు రహదారి సౌకర్యం లేదని, అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి రోగులను తీసుకెళ్ల డానికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. బోరు బావుల నుంచి బురద నీరు వస్తోందని, అదే మాకు ఆధారమన్నారు. విద్యుత్ సౌకర్యం లేదని చీకటి పడితే బిక్కుమంటూ జీవిస్తున్నామన్నారు. అర్హులందరికీ ఓటు హక్కు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఇప్పించాలని కోరారు. సాలూరు మండలం కోదమ, పట్టెచెన్నూరు గ్రామాల నుంచి బతుకు తెరువు కోసం ఇక్కడకు తాము వచ్చామన్నారు. గోపాలరాయుడుపేట పంచాయితీలో విలీనం చేసి, ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ అటవీ భూములను ఇష్టానుసారంగా సాగుచేయడం నేరమన్నారు. అనంతరం డీడీవో మాట్లాడుతూ మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమం లో ఎంపీడీవో రవికుమార్, డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావు, అటవీ రేంజ్ అధికారి రాజగోపాలరావు, పీఆర్ ఏఈ రాజశేఖర్, ఆర్‌డబ్య్లూఎస్ ఏఈ విశ్వతేజ, విద్యుత్ శాఖ ఏఈ రఘు, పంచాయతీ కార్యదర్శి జి.ఉమ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.