మత్స్యకారులను సురక్షితంగా తీసుకొస్తాం
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:51 PM
బంగ్లాదేశ్‌లో జైల్లో ఉన్న మత్స్యకా రులను సురక్షితంగా తీసుకొచ్చే బాధ్య త ప్రభుత్వానిదే అని మంత్రి కొండప ల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్
భోగాపురం, జనవరి 11(ఆంధ్రజ్యో తి): బంగ్లాదేశ్‌లో జైల్లో ఉన్న మత్స్యకా రులను సురక్షితంగా తీసుకొచ్చే బాధ్య త ప్రభుత్వానిదే అని మంత్రి కొండప ల్లి శ్రీనివాస్ అన్నారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సాయం, నిత్యావసర సరు కులను కొండ్రాజుపాలెం గ్రామంలో ఆదివారం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ కోస్టుగార్డులకు చిక్కి న జిల్లాకు చెందిన మత్స్యకారులను ఇక్కడికి తీసుకొ చ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందన్నారు. అయితే బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు మన దేశంలో పట్టుబడి ఉండడంతో వారిని విడిచి పెట్టే విధంగా సన్నాహాలు జరిగాయన్నారు. అనంతరం మార్క్‌ఫెడ్ చైర్మన్, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడు తూ మత్స్యకారులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద న్నారు. అనంతరం 9 కుటుంబాలకు ప్రభుత్వం మం జూరు చేసే రూ.30వే లు చొప్పున చెక్కులు, 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాట్ల కీర్తి, తహసీల్దార్ రమణమ్మ, ఆర్‌ఐ గోపాలకృష్ణ, వీఆర్వో నవీన్, భోగాపురం, పూసపాటిరేగ మండలాల నాయకులు పాల్గొన్నారు.