నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:54 PM
ఈనెల 28న చీపురుపల్లి రావివలస పర్యటనకు రానున్న ముఖ్యమం త్రి చంద్రబాబుకు నియోజకవర్గ సమస్యలను వివరించ నున్నట్టు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు.
ఎమ్మెల్యే కళావెంకటరావు
చీపురుపల్లి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఈనెల 28న చీపురుపల్లి రావివలస పర్యటనకు రానున్న ముఖ్యమం త్రి చంద్రబాబుకు నియోజకవర్గ సమస్యలను వివరించ నున్నట్టు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన చీపురుపల్లిలోని టీడీ పీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చీపురుపల్లి నియోజకవర్గానికి వస్తున్నారని, ఈ సమయంలో ఆయనకు పలు సమస్య లు వివరిస్తామన్నారు. ముఖ్యంగా ఆర్‌ఈసీఎస్ పునరు ద్ధరణ, తోటపల్లి కాలువలో పూడితతీత కోసం కేటా యించిన నిధుల విడుదల, గరివిడి పశు సంవర్థక కళాశాలకు అదనపు భవనాలు తదితర విషయాలు వివరిస్తామన్నారు. గత 20 నెలల్లో సామాజిక పింఛన్ల కోసం రూ.57 వేల కోట్లు వెచ్చించారన్నారు. ముఖ్యమం త్రి ప్రజావేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి న బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నా రు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, పార్టీ నాయకులు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, రౌతు కామునాయుడు, తాడ్డి సన్యాసినాయుడు, పైల బల రాం, వెన్నె సన్యాసినాయుడు, సారేపాక సురేష్, దాసరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.