శత శాతం విజయం సాధిస్తాం
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:13 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధిస్తామ ని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.
రాజాం ఎమ్మెల్యే కోండ్రు
రాజాం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధిస్తామ ని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఎంపీ టీసీ అభ్యర్థులు, కూటమి నాయకులతో కలిసి ఆయన గురువారం కొండంపేట కూడలి నుంచి పోలిపల్లి పైడితల్లి అమ్మవారి గుడి వరకు ర్యాలీలో పాల్గొన్నా రు. అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అభ్య ర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ నాయకులు గురవాన నారాయణరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ దుప్పలపూడి శ్రీనివాసరావు, పిల్ల సత్యంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ నుంచి ఎస్.కోట మండలం సంతగైరమ్మపేట ఎంపీటీసీ అభ్యర్థిగా రాయవరపు చంద్రశేఖర్ గురువా రం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ హాజరయ్యారు.