Share News

రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలి

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:23 AM

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రతి అధికారి పనిచేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సూచించారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగమాధవి

  • నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి

భోగాపురం, జూన్‌17(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రతి అధికారి పనిచేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సూచించారు. బుధవారం ముంజేరు సమీప జనసేన పార్టీ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని రైతులను అన్ని విదాలా ఆదుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయమన్నారు. ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని, మెట్ట భూ ముల్లో అంతర పంటల సాగుకు ప్రణాళికలు సిద్దం చేయాలని కోరారు. జూన్‌ 20వ తేదీ తర్వాత మామిడికొమ్మలు కత్తిరింపుపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:24 AM