పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:26 AM
ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు.
కురుపాం రూరల్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. శనివారం ఉదయపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ హైస్కూల్ ప్రాంగణంలో తోయక జగదీశ్వరి మొక్కలు నాటారు. బాలికలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి, టీడీపీ మండల కన్వీనీరు కలిశెట్టి కొండయ్య, కోలా రంజిత్ కుమార్, సూర్యదే వాలయం డైరక్టర్ వెంప టాపు భారతి, రమణమూర్తి పాల్గొన్నారు.