We removed the hardships of the passengers ప్రయాణికుల కష్టాలు తొలగించాం
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:56 PM
We removed the hardships of the passengers చీపురుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించే ప్రయాణికుల కష్టాలను తొలగించామని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రూ.12.97 కోట్లతో పట్టణంలో నిర్మించిన ఆర్వోబీని వారు శనివారం ప్రారంభించారు.
ప్రయాణికుల కష్టాలు తొలగించాం
ఎమ్మెల్యే కళావెంకటరావు, ఎంపీ కలిశెట్టి
చీపురుపల్లి ఆర్వోబీ ప్రారంభం
చీపురుపల్లి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించే ప్రయాణికుల కష్టాలను తొలగించామని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రూ.12.97 కోట్లతో పట్టణంలో నిర్మించిన ఆర్వోబీని వారు శనివారం ప్రారంభించారు. తొలిసారిగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏడేళ్లుగా ప్రజలు పడిన కష్టాలు నేటితో తొలగిపోయాయన్నారు. గత ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పనులు పరుగులు తీయించామన్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలతో పనిచేయడం వల్లే బ్రిడ్జి నిర్మాణాన్ని యేడాదిన్నరలో పూర్తి చేయగలిగామన్నారు. సర్వీసు రోడ్డు నిర్మాణంలో ఇబ్బందులెదురైనప్పటికీ స్థానికుల సహకారంతో అన్నింటినీ అధిగమించి బ్రిడ్జిని వినియోగంలోకి తెచ్చామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, గద్దే బాబూరావు, కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, ముల్లు రమణ, ఇజరోతు రాంబాబు, మూడు మండలాల నాయకులు, బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు మన్నెపురి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.