పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:18 AM
పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు.
ప్రజలకు పిలుపునిచ్చిన ప్రజాప్రతినిధులు, న్యాయాధికారులు
ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
విజయనగరం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. శుక్ర వారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో సైకిల్ తొక్కి.. అందరినీ ఉత్సాహ పరిచారు. ఆమెతో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంటా రవి తదితరులు సైకిల్ తొక్కారు.
నెల్లిమర్ల, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పర్యా వరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావా లని మార్క్‌ఫెడ్ చైర్మన్, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు పిలుపునిచ్చారు. శుక్రవా రం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయ న రామతీర్థం జంక్షన్ నుంచి నెల్లిమర్ల టీడీపీ కార్యా లయం వరకు సైకిల్ తొక్కుతూ గ్రీవెన్స్‌కు హాజరయ్యా రు. ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి గేదెల రాజారావు, నగర పంచాయతీ అధ్యక్షుడు లంక అప్పలనాయుడు పాల్గొ న్నారు.
రాజాం రూరల్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సీనియర్ న్యాయాధికారి కె.శారదాంబ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె మొక్కలు నాటారు. అంతకుముం దు కోర్టు ప్రాంగణం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. జూనియర్ న్యాయాధికారి నైమి ష, రాజాం టౌన్ సీఐ అశోక్‌కుమార్, మున్సిపల్ శానిట రీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతిని ధులు, బార్ అసోసియేషన్ న్యాయవా దులు, పారాలీ గల్ వలంటీర్లు పాల్గొన్నారు.
విజయనగరం దాస న్నపేట, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాల ని జిల్లా మొదటి అదనపు న్యాయాధికారిణి కె.విజయకళ్యాణి పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపం చ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగ ణంలో ఆమె మొక్కలు నాటారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఎన్.రమేష్‌నాయుడు, వీఎల్‌ఏపీయూఎస్ చైర్మన్ దుర్గ య్య, ఎం.శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ ప్రతినిధు లు బ్రహ్మాజీ, మురళి, ఏపీపీ గేదెల సత్యం, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బెల్లాన రవితో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.