వికసిత్ భారత్‌లో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:16 AM
18 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువత 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడానికి భాగ స్వాములు కావాలని స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనా యుడు పిలుపునిచ్చారు.
ఎంపీ కలిశెట్టి
విజయనగరం రూరల్, మార్చి 2(ఆంధ్రజ్యోతి): 18 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువత 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడానికి భాగ స్వాములు కావాలని స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనా యుడు పిలుపునిచ్చారు. సోమవారం విజయనగరం లోని జేఎన్‌టీయూ జీవీలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్-20 47 సాకారానికి ప్రధాని నరేంద్రమోదీ, స్వర్ణాంధ్ర-2047 కోసం సీఎం చంద్రబాబు ఎంతోగానో శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు, రిజిస్టార్ జి.జయసుమ, ప్రిన్సిపాల్ కేసీబీ రావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం కో-ఆర్డినే టర్ వి.మణికుమార్ పాల్గొన్నారు.