కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:20 AM
: స్థానికసంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ పరిశీలకుడు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణ్వ్గోపాల్ కోరారు.
నెల్లిమర్ల, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): స్థానికసంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ పరిశీలకుడు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణ్వ్గోపాల్ కోరారు. బుధవారం మండలంలోని నెలివాడలోని నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్ర మంలో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, నెల్లిమర్ల మండల టీడీపీ అధ్యక్షుడు కడగల ఆనంద్కుమార్, టీడీపీ నాయకులు సువ్వాడ రవిశేఖర్, మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్, పతివాడ అప్పలనారాయణ, గేదెల రాజారావు, మహంతి శంకరరావు, కర్రోతు సత్యనారాయణ, లెంక అప్పలనాయుడు, అవనాపు సత్యనారాయణ, గురాన చక్రధర్ పాల్గొన్నారు.