సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:58 PM
పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగా ర్రాజు కోరారు. బుధవారం నెల్లిమర్ల తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో మండలం, టౌన్ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో మండలస్థాయి సమావేశం జరిగింది.
నెల్లిమర్ల, జూన్ 10(ఆంధ్రజ్యోతి): పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగా ర్రాజు కోరారు. బుధవారం నెల్లిమర్ల తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో మండలం, టౌన్ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో మండలస్థాయి సమావేశం జరిగింది. తొలుత ఇటీవల మరణించిన టీడీపీ నాయకులు సారిపల్లి బాబూరావు మృతికి మౌనం పాటించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కడగల ఆనం ద్‌కుమార్, టౌన్ పార్టీ అధ్యక్షుడు లెంక అప్పలనాయుడు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, బోర్డు డైరెక్టర్ కింతాడ కళావతి, గేదెల రాజారావు పాల్గొన్నారు.
ఫపూసపాటిరేగ, జూన్10(ఆంధ్రజ్యోతి): స్థానిక పార్టీ కార్యాలయంలో మార్క్‌ఫెడ్ చైర్మన్, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ బలోపేతంతోపాటు, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజాసమస్యలపట్ల చేపట్టాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, మహంతి శంకరరావు, తమ్మినాయుడు పాల్గొన్నారు.