Share News

ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాలి

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:01 AM

w

   ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాలి
మాట్లాడుతున్న జగదీశ్వరి

కొమరాడ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): టీడీపీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి కోరారు. శనివారం కొమరాడలో పార్టీ మండలాధ్యక్షు డు శేఖర్‌పాత్రుడు అధ్యక్షతన 29 లక్షల రూపా యలతో నిర్మించిన టీడీపీ కార్యాలయానికి ప్రారంభిం చారు. పార్టీ కార్యాలయానికి పదిసెంట్లు స్థలాన్ని ఇచ్చిన మహిళా అభిమాని పంతుల వెంకటలక్ష్మికి జగదీశ్వరి, అరకుపార్లమెంట్‌ టీడీపీఅధ్యక్షురాలు తేజో వతి, మహిళా నాయకులు పావని, లావణ్యలత సత్క రించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీ లకులు వెంకటేష్‌, టీడీపీ మండల కన్వీనర్‌ శేఖర్‌పాత్రుడు, అరకు పార్ల మెంట్‌ రైతుఅధ్యక్షుడు వెంకట్‌నాయుడు, ఎన్‌.మధుసూదనరావు, పొట్నూరు వెంకటనాయుడు, మరడాన కృష్ణంనాయుడు, గొట్టాపు త్రినాఽథం పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:01 AM