ఎస్‌ఐఆర్‌పై సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:38 PM
ఎస్‌ఐఆర్‌పై ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగర్రాజు సూచించారు. బుధవారం పూసపాటిరేగలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పూసపాటిరేగ, జూన్24 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్‌పై ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగర్రాజు సూచించారు. బుధవారం పూసపాటిరేగలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతిఒక్కరూ జాబితాలో ఉండే విధంగా గ్రామస్థాయిలో బీఎల్‌ఏలు బీఎల్‌వోలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. నియోజకవర్గ పరిశీలకుడు ప్రణవ్ గోపాల్ ఎస్‌ఐఆర్ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్, నాయకులు పతివాడ అప్పలనారాయణ, ఆకిరి ప్రసాదరావు, టీడీపీ మండలాధ్యక్షుడు మహంతి శంకర్రావు పాల్గొన్నారు.