Share News

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:32 PM

సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత అన్నారు.

 పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
మొక్క నాటి నీరు పోస్తున్న ప్రధాన న్యాయాధికారి బబిత

- జిల్లా ప్రధాన న్యాయాధికారి బబిత

విజయనగరం దాసన్నపేట, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు స్వాతంత్య్ర వేడుకలు పురస్కరించుకుని తీర ప్రాంతమైన పూసపాటిరేగ మండలం వెల్ధూరు గ్రామ పంచాయతీ కిలుగుపేటలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. తీర ప్రాంతాల్లో నాటిన మొక్కలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆ ప్రాంతాలను కాపాడతాయని అన్నారు. ఈ సందర్భంగా 200 మొక్కలు నాటారు. కార్యక్రమంలో విజయనగరం అదనపు జ్యూడిషీయల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ తేజా చక్రవర్తి, పూసపాటిరేగ ఎంపీడీవో రాధిక, భోగాపురం రూరల్‌ సీఐ దుర్గాప్రసాద్‌, ఎస్‌ఐలు, అటవీశాఖాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 11:32 PM