Share News

విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:27 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగా లని పార్టీ నేతలు,కార్యకర్తలకు శృంగవరపుకోట ఎమ్మెల్యే లలితకుమారి పిలుపునిచ్చారు.

 విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే లలితకుమారి:

లక్కవరపుకోట, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగా లని పార్టీ నేతలు,కార్యకర్తలకు శృంగవరపుకోట ఎమ్మెల్యే లలితకుమారి పిలుపునిచ్చారు. బుధవారం ఎల్‌.కోటలో నియోజకవర్గ స్థాయి టీడీపీ కేడర్‌, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ ఇన్‌చార్జిలు, క్లస్టర్‌, బూత్‌ లెవెల్‌ కార్య కర్యలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమం లో నాయకులు కేబీఏ రాంప్రసాద్‌, దాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ రత్నాజీ, విశాఖ పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు శేఖర్‌, పార్టీ మండలాధ్యక్షులు ఈశ్వరరావు, ఏఎంసీ చైర్మన్‌ మల్లునాయుడు, శ్రీను, చిన్నబ్బినాయుడు, భూపాల్‌నా యుడు, శ్రీరామ్మూర్తి, బంగారు రమేష్‌ పాల్గొన్నారు.

ఫ కొత్తవలస, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత పెరగాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరారు. కొత్తవలస వసంత్‌ విహార్‌లో వినాయక నవరాత్రుల్లో భాగంగా అన్నసమారాధన, నిమజ్జనోత్సవ కార్యక్రమంలో లలితకుమారి, రాంప్రసాద్‌ దంపతులు పాల్గొన్నారు. తొలుత వినాయకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకాష్‌బాబు, రాష్ట్రదాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీరత్నాజీ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:27 AM