Share News

ఎండీఎంలో మెనూ పాటించాలి

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:24 AM

మధ్యాహ్న భోజన పథకంలో మెనూ పాటించాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ సూచించారు.

ఎండీఎంలో మెనూ పాటించాలి

ఎమ్మెల్యే కోండ్రు

రాజాం, మార్చి 17(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకంలో మెనూ పాటించాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ సూచించారు. మండలంలోని పొగిరి జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సక్రమంగా భోజ నం పెట్టకపోతే తన దృష్టికి తీసుకురావాలని విద్యా ర్థులకు సూచించారు. అనంతరం హెచ్‌ఎం పద్మావతితో మాట్లాడారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అం దించాలన్నారు. అలాగే నాణ్యత లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయ కులు మూడడ్ల శ్రీనివాసరావు, గురవాన నారాయణ రావు, పార్టీ మండల అధ్యక్షుడు సుమల వెంకటమ న్మథరావు తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన విద్యకు కృషి

ఎమ్మెల్యే కళా

గరివిడి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల ల్లో మెరుగైన విద్యాబోధన జరిగే విధంగా రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తోందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. మండలంలోని ఎం.దుగ్గివ లస గ్రామంలోగల ప్రభుత్వ పాఠశాలను ఆయన మం గళవారం సందర్శించి, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పి.రామారావు, టీడీపీ నాయకులు పైల బలరాం, సారిపాక సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:24 AM