సేవాగుణం అలవరచుకోవాలి: కలెక్టర్
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:57 PM
విద్యార్థి దశనుంచే సేవాగుణాన్ని అలవరచు కోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహనకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ లభిస్తున్న అవకాశాలను సద్వి నియోగం చేసుకొని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
గుమ్మలక్ష్మీపురం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశనుంచే సేవాగుణాన్ని అలవరచు కోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహనకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ లభిస్తున్న అవకాశాలను సద్వి నియోగం చేసుకొని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మానవతా దృక్పధంతో సేవలందిస్తున్న రెడ్‌క్రాస్ సంస్థలో ప్రతి ఒక్కరు సభ్యులుగా ఉండాలన్నారు. కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించడం సాధ్య మేన్నారు. అనంతరం దుప్ప ట్లను నిరుపేదలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎం.శ్రీరా మ్మూర్తి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా లక్కగూడ పంచాయతీలోని మొరమ గ్రామంలో జరుగుతున్న ఫ్యామిలీ ముస్తాబు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ పీడీలు ఎం.సుధాకరాణి, టి.కనకదుర్గ పాల్గొన్నారు.