Share News

పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలి

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:26 AM

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో వేయాలని, పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు.

 పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలి
ఆసుపత్రి పరిసరాలను పరిశీలిస్తున్న విప్‌ జగదీశ్వరి:

గుమ్మలక్ష్మీపురం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో వేయాలని, పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని దిగువమ్రండ గ్రామంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమం, అవగాహన ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. అలాగే గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి 50 పడకల సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని జగదీశ్వరి పరిశీలించారు. ఈనెల 22న ప్రారంభోత్సవం చేయనుండడంతో పెండిం గ్‌ పనులను వేగంగా పూర్తిచేసి అన్ని వైద్య సౌకర్యాలు, రహదారులు, పార్కింగ్‌ ఏర్పాట్లు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, కురుపాం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కడ్రక కళావతి, అరకు పార్లమెంట్‌ సహాయ కార్యదర్శి తాడంగి రామారావు, అడ్డాకుల నరేష్‌, నిమ్మక సింహాచలం, కోలా రంజిత్‌, తాడంగి లక్ష్మణరావు, క్రాంతికుమార్‌, లింగరాజు, బొంగు సురేష్‌, రామారావు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:26 AM