భూములు కాపాడుకోవడానికి ముందుకురావాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:54 PM
భూములను కాపాడుకోవడమే లక్ష్యంగా అందరు ముందుకు రావాలని నాలుగు గ్రామాల రైతులు నిర్ణయిం చారు. భూములు పోకుండా ఉండాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధం కావాలని స్పష్టంచేశారు.
భోగాపురం, ఫిబ్రవరి8(ఆంధ్రజ్యోతి): భూములను కాపాడుకోవడమే లక్ష్యంగా అందరు ముందుకు రావాలని నాలుగు గ్రామాల రైతులు నిర్ణయిం చారు. భూములు పోకుండా ఉండాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధం కావాలని స్పష్టంచేశారు. ఆదివారం మండలంలోని నందిగాంలో నందిగాం, కొటభోగాపురం,శింగవరం, నాతవలసకు చెందిన రైతులు సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూములు చేజారకుం డా ఉండడానికి అధికారులు, నాయకులకు వినతులు ఇస్తున్నా పరిశీలనలు ఆగడంలేదని వినతులు పట్టించుకోనే దాఖలాలు కనిపించడంలేదన్నారు. పరిశ్రమలు ఏర్పాటు పేరుతో భూములు జోలికి రాకుండా ఉండాలంటే న్యాయస్థానమే దిక్కుఅన్నారు. కార్యక్రమంలో రైతులు మురళీమోహనరా వు, ఏఎంసీ డైరెక్టర్ వెంకటరమణ పాల్గొన్నారు.