Share News

అన్నిపంచాయతీలను కైవసం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:21 AM

మండలంలో అన్ని పంచా యతీలను కైవసం చేసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఆదివారం పాచిపెంటలో టీడీపీకార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు.

     అన్నిపంచాయతీలను కైవసం చేసుకోవాలి
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

పాచిపెంట రూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలో అన్ని పంచా యతీలను కైవసం చేసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఆదివారం పాచిపెంటలో టీడీపీకార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే బలమని, పనిచేసిన కార్యకర్తలకు ఎప్పుడు పార్టీఅండగా ఉండడమే కాకుండా గుర్తింపుఉంటుందని చెప్పా రు. ఎంపీటీసీ స్థానాల్లో ఓడిపోయిన వ్యక్తులు ఎవరూ బాధపడవద్దని, పార్టీ కోసం మళ్లీ పనిచేయాలని సూచించారు. పంచాయతీలను గెలిపించుకుంటే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని, 29 పంచాయతీల్లో టీడీపీ జెండా రెపరెపలాడాలని తెలి పారు. కొంతమంది వెన్నుపోటు రాజకీయాలు చేసిన వ్యక్తులను దూరం పెట్టామని, అటువంటి వారిని ప్రజలు కూడా నమ్మరని, వారి కుటిల రాజకీయాలను ప్రజలు ఛీకట్టారని గుర్తు చేశారు. ఏకగ్రీవం చేసుకుంటే ఆ ప్రోత్సాహకాలు పంచాయతీల అభివృద్ధికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో సాలూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముఖి సూర్యనారాయణ, దండి ఏడుకొండలరావు, మండల ప్రధాన కార్యదర్శి మతల బలరాం, పీఏసీఎస్‌ అధ్యక్షుడు మాదిరెడ్డి మజ్జరావు, నాయకులు చల్లా కనకబాబు, కొత్తల పోలినాయుడు, కొరిపల్లి సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2026 | 12:21 AM