Share News

ప్రతి హామీని నిలబెట్టుకున్నాం

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:05 AM

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.

ప్రతి హామీని నిలబెట్టుకున్నాం

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి

కొత్తవలస, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం వీరభద్రపురం గ్రామంలో నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. రాష్ట్ర దాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీ రత్నాజీ, కొత్తవలస పీఏసీఎస్‌ అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కూటమితోనే రైతులకు న్యాయం..

కూటమి ప్రభుత్వంతోనే రైతులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం వీరభద్రపురంలో నిర్వహించిన మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 2,654మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. తహసీల్దార్‌ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 12:05 AM