శతశాతం విద్యాకిట్ల్లు పంపిణీ చేశాం
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:19 AM
ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాకిట్లను శతశాతం విద్యార్థులకు పంపిణీ చేసినట్టు విద్యాశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్‌జేడీ విజయభాస్కర్ తెలిపారు.
జిల్లాకు ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు అవసరం లేదు
విద్యాశాఖ ఆర్‌జేడీ విజయభాస్కర్
నెల్లిమర్ల, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాకిట్లను శతశాతం విద్యార్థులకు పంపిణీ చేసినట్టు విద్యాశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్‌జేడీ విజయభాస్కర్ తెలిపారు. గురువారం ఆయన నెల్లిమర్ల ఎంఈవో కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఎంఈవోలు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, పలు విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం తాజాగా నియమిం చాలని అనుకుంటున్న ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు విజయనగ రం జిల్లాకు అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే జిల్లా లో ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారని చెప్పారు. సర్వశిక్షా సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతం బకాయి లు ఈనెల 25 నాటికి జమవుతాయని తెలిపారు. గ్రా మాలకు సుదూరంలో ఉన్న నూతన కాలనీల్లో కనీసం 30 మంది విద్యార్థులు ఉంటే ఆ కాలనీల్లో కొత్త పాఠశా లల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సారిపల్లి పారిశ్రామికవాడలో ఉన్న నూతన కాలనీలో సర్వేచేసి విద్యార్థుల సంఖ్యపై ఆరా తీయాలని ఎంఈ వోలను ఆదేశించారు. గత ప్రభుత్వ సమయంలో నిర్మా ణ దశలో మిగిలిపోయిన పాఠశాలల పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎంఈవోలు, ఎంజేపీ బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.