సిరిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తాం
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:14 AM
పైడిమాంబ సిరిమానోత్సవాన్ని ఈ ఏడాది వైభ వంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు హోం మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత చెప్పారు
విజయనగరం కల్చరల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యో తి): పైడిమాంబ సిరిమానోత్సవాన్ని ఈ ఏడాది వైభ వంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు హోం మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు వచ్చిన హోంమంత్రిని సో మవారం విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు క్యాంపు కార్యాలయంలో దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష మర్యాద పూర్వకంగా కలిశారు. వచ్చే నెల 27న జరిగే పైడి మాంబ సిరిమానోత్సవానికి హాజరు కావాలని కోరు తూ ఆహ్వాన పత్రికను, అమ్మ వారి ప్రసాదాన్ని అంద జేశారు. ఈసందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ సిరిమానోత్సవానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామ ని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిరి మాను పూజారి బంటుపల్లి వెంకటరావు, పాలకమం డలి సభ్యులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అర్చకులు హోంమంత్రి అనితకు ఆశీర్వాదం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం
విజయనగరం దాసన్నపేట, సెప్టెంబరు 26(ఆంధ్ర జ్యోతి): విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బం ది చేసిన సేవలు అభినందనీయమని హోంమంత్రి అనిత అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన అగ్నిమా పక కేంద్ర భవనాన్ని ఆమె సోమవారం ప్రారంభించా రు. అలాగే పూసపాటిరేగ, బొబ్బిలి అగ్నిమాపక కేం ద్రాలను ఆయా ఎమ్మెల్యేల చేతులమీదుగా ప్రారంభిం చారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట, మన్యం జిల్లా పాల కొండలో అగ్నిమాపక కేంద్రాలను వర్చువల్‌గా ప్రారం భించారు. కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయు డు, ఎమ్మెల్యేలు బీబీనాయన, ఎమ్మెల్యే నాగమాధవి, అదితి, డీజీ డీవీ రమణ, ఏడీజే శ్రీనివాస్, డీఎఫ్‌వో రాజేష్, ఏడీఎఫ్‌వో సోమేశ్వరరావు పాల్గొన్నారు.