అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:24 AM
తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిరసన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడానికి ఖండిస్తున్నామని సీఐటీయూ సంఘాల నాయకులు అన్నారు.
తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిరసన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడానికి ఖండిస్తున్నామని సీఐటీయూ సంఘాల నాయకులు అన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా మంగళశారం అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి, నిరసన చేపట్టారు. అక్రమ అరెస్టులు తగవని నినాదాలు చేశారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అన్ని సంక్షేమ పథకాలనూ తమకు వర్తింపజేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ లీడర్లు పాల్గొన్నారు.
(ఆంధ్రజ్యోతి బృందం)