కళ్లు మూసుకుంటాం.. తవ్వేసుకో!
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:01 AM
ఆయన నామి నేటెడ్ పదవిలో ఉన్న అధికారపార్టీ నాయకుడు. చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
నామినేటెడ్ నేత హవా
రాజాం పరిసరాల్లో ఎవరికి కంకర కావాలన్నా నామినేటెడ్ పదవిలో ఉన్న అధికారపార్టీ నాయకుడిని ఆశ్రయిస్తున్నారు. దీంతో అతను కొత్త కంచరాం పరిధిలోని చెరువును అడ్డుగోలుగా తవ్వేస్తున్నాడు.
ప్రతిరోజూ వందల ట్రాక్టర్లు
పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రతినిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లతో కంకరను లేఅవుట్లు, ప్రైవేటు నిర్మాణాలకు అక్రమంగా తరలిస్తున్నారు. రాజాం మెయిన్ రోడ్డులోనే ఇవి వెళ్తున్నాయి.
రియల్ దందాకు ఊతం
రాజాం మున్సిపాలిటీతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, పాలకొండ మార్గాల్లో 15 కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న లేఅవుట్లలో నేల చదును చేయడానికి ఈ కంకరను భారీగా విక్రయిస్తున్నారు.
రైతులను తీరనిలోటు
కొత్తకంచెరాం పైడెగు చెరువులో నాణ్యమైన కంకర లభిస్తుంది. దీంతో ఎక్స్‌కవేటర్లతో విచ్చలవిడిగా తవ్వేసి చెరువు అస్తిత్వాన్ని, ఆకారాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. దీంతో రైతులకు నష్టం కలుగుతోంది.
అధికారులు ఏం చేస్తున్నారు
ప్రజాప్రతినిధుల పర్యటనల్లో హంగామా చేసే ఈ నామినేటెడ్ నాయకుడి అండదండలతో ఈ దందా సాగుతుండడంతో రెవెన్యూ, పోలీసుశాఖలు చూచిచూడనట్లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
ఇష్టారాజ్యంగా చెరువులో కంకర అక్రమ తవ్వకాలు
కొత్త కంచరాంలో స్వరూపమే మారిన పైలోడు చెరువు
అధికారపార్టీకి చెందిన నామినేటెడ్ నాయకుడి దందా!
చోద్యం చూస్తున్న అధికారులు
రాజాం రూరల్, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఆయన నామి నేటెడ్ పదవిలో ఉన్న అధికారపార్టీ నాయకుడు. చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాజాం మండలం కొత్త కంచరాం కొత్తకంచరాం గ్రామ పరిసరాల్లోని చె రువు సదరు నాయకుడి దందా కారణంగా స్వ రూపమే కోల్పోతోంది. ప్రతిరోజూ ఎక్స్‌కవేటర్లతో కంకరను తవ్వి ట్రాక్టర్లలో లేఅవుట్లకు తరలించి ఆ నాయకుడు సొమ్ము చేసుకుంటున్నాడు. అధికార పార్టీ నాయకుడు కావడం, ప్రజాప్రతినిధి పర్యట నలలో హంగామా చేస్తుండడంతో రెవెన్యూ, పొ లీస్ యంత్రాంగం అటువైపు దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. పట్టపగలో రాజాం మెయిన్ రోడ్డు మీదుగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు తరలి స్తున్నా అధికారులు మిన్న కుండి పోతున్నారు. రోజూ 100 లో డ్ల వరకు తరలిస్తున్నట్లు తెలుస్తోం ది. రాజాం మున్సిపాలిటీతో పాటు వి జయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, పా లకొండ మార్గాలలో 15 కిలోమీటర్ల ప రిధిలో లేఅవుట్లు విరివిగా వెలిశాయి. వ్యవసాయ భూములు వెంచర్లుగా మార్చేశారు. వీటిని చదును చేయాలం టే కంకర అవసరం. దీంతో సదరు నాయకుడు చెరువులో కంకరను తవ్వేసి ఈ లేఅవుట్లను అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం సొంత ట్రాక్టర్లతో పాటు మరికొన్ని అద్దెకు తీసుకుని నడిపిస్తున్నాడు. పగలు రాత్రి తేడా లేకుండా కంకరను లే అవుట్లతో పాటు భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు తరలిస్తున్నాడు. ట్రాక్టర్ కంకరను రూ.500-700 వరకు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు 100 ట్రాక్టర్లకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు వ్యాపారం సాగుతోంది. ఖర్చులుపోను రోజుకు రూ.35వేల నుంచి రూ.50వేల వరకు సదరు నాయకుడి జేబులోకి వెళ్తున్నట్లు సమాచారం.
అక్రమంగా తవ్వితే వాహనాలు సీజ్ చేస్తాం: రాజశేఖర్, రాజాం తహసీల్దార్
చెరువుల్లో అక్రమంగా కంకర తవ్వకాలు చేయడం, అమ్మడం చట్టవిరుద్ధం. అలా ఎవరు చేసినా చర్యలు తప్పవు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని తెలుసుకుంటాను. తవ్వకాలు చేస్తూ పట్టుబడితే వాహనాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తాం.