సిరి సహస్ర కుల వివాదంపై జోక్యం చేసుకోలేం
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:17 AM
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రం వివాదంపై జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ లెవల్ స్ర్కూటినీ కమిటీ వద్ద విచారణ జరుగుతున్న నేపథ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.
ప్రస్తుతం జిల్లా స్థాయి స్ర్కూటినీ కమిటీ వద్ద విచారణ జరుగుతోంది
ఈ దశలో జోక్యానికి తగిన కారణాలు లేవు
ఉత్తర్వులు ఇస్తే ఆ విచారణపై ప్రభావం పడే అవకాశం
సహస్ర పొందుతున్న ప్రయోజనాలు కలెక్టర్ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి
హైకోర్టు స్పష్టీకరణ.. ఉత్తర్వులు
బీసీ-డీ సర్టిఫికెట్ వినియోగించకుండా నిరోధించాలన్న అభ్యర్థన తిరస్కరణ
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రం వివాదంపై జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ లెవల్ స్ర్కూటినీ కమిటీ వద్ద విచారణ జరుగుతున్న నేపథ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో జోక్యం చేసుకొనేందుకు తగిన కారణాలు కని పించడం లేదని శుక్రవారం పేర్కొంది. బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రంతో సిరి సహస్ర పొందే ఏ ప్రయో జనమైనా కలెక్టర్ ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. బీసీ-డీ సామాజిక హోదా ను కోరకుండా, తహసీల్దార్ జారీ చేసిన బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రం, స్థానికత, పుట్టిన తేదీ పత్రాలను వినియోగించకుండా అడ్డుకునేలా అధికారులను ఆదే శించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. అను బంధ పిటిషన్‌ను మూసివేసింది. ప్రధాన వ్యాజ్యంపై తదుపరి విచారణను డిసెంబరు 3కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఉత్తర్వులు ఇచ్చారు.
సహస్ర కులంపై వివాదం ఏంటి?
జైన్ కుటుంబంలో జన్మించిన సిరి సహస్రను మజ్జి శ్రీనివాసరావు 2020లో దత్తత తీసుకున్నారని, ఈ నేపథ్యంలో ఆమెను తూర్పు కాపు/గాజుల కాపుగా పరిగణిస్తూ తహసీల్దార్ జారీ చేసిన బీసీ-డీ సర్టిఫికెట్ చెల్లుబాటు కాదని సవాల్ చేస్తూ విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన బొమ్మి శ్రీనివాసరావు అనే వ్యక్తి పిటిషన్ వేశారు. సహస్ర కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరారు. బీసీ-డీ సామాజిక హోదాను కోరకుండా, తహసీల్దార్ జారీ చేసిన బీసీ-డీ సర్టిఫికెట్, స్థానికత, పుట్టిన తేదీ పత్రాలను వినియో గించకుండా అడ్డుకునేలా అధికారులను ఆదేశించాలని అనుబంధ పిటిషన్ వేశారు. శుక్రవారం పిటిషనర్ తరఫున న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ వాదనలు వినిపించారు. జైన్ కుటుంబంలో పుట్టిన సహస్ర ఓసీ కేటగిరీ కిందకు వస్తారన్నారు. దత్తత తీసుకున్నంత మాత్రాన ఆమె కులం మారదని, సహస్రకు బీసీ-డీ సర్టిఫికెట్ ఇవ్వడం షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబ డిన తరగతుల చట్టనిబంధనలకు విరుద్ధమని వాదిం చారు. జిల్లా కలెక్టర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సహస్ర కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని, ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని పిటిషనర్ ఎన్నిక ల అధికారికి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇది పూర్తిగా ఎన్నికల వివాదమని, ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నిక ల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుందని, హైకో ర్టును ఆశ్రయించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఈ వివాదం జిల్లా స్థాయి స్ర్కూటినీ కమిటీ, కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందని సిరి సహస్ర తరఫు సీనియర్ న్యా యవాది విద్యాసాగర్ కోర్టుకు తెలిపారు. ఈ దశలో ఎ లాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ఇరు వైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయ మూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు.
తీర్పులో ఏముందంటే..
‘‘కుల ధ్రువీకరణ పత్రం విషయంలో పిటిషనర్ ఫి ర్యాదును పరిగణనలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ ఇప్ప టికే సిరి సహస్రకు నోటీసులు జారీ చేశారు. చట్టం లోని రూల్ 9 ప్రకారం జిల్లా కలెక్టర్ కుల ధ్రువీకరణ పత్రాలపై వచ్చే ఫిర్యాదులను జాయింట్ కలెక్టర్ నేతృ త్వంలోని జిల్లా స్థాయు స్ర్కూటినీ కమిటీకి పంపించా ల్సి ఉంటుంది. ఇరుపక్షాలు శుక్రవారం ఆ కమిటీ ముం దు హాజరయ్యారు. కుల ధ్రువీకరణ పత్రం వివాదంపై స్ర్కూటినీ కమిటీ వద్ద విచారణ కొనసాగుతోంది. తదు పరి విచారణ డిసెంబరు 10కి వాయిదా పడింది. ఈ దశలో ఏదైనా ఉత్తర్వులు ఇస్తే విచారణ ప్రక్రియ పై ప్రభావం పడే అవకాశం ఉంది. బీసీ-డీ సర్టిఫికెట్ ఆధా రంగా సహస్ర పొందే ఏ ప్రయోజనమైనా కలెక్టర్ ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుంది’ అని న్యా యమూర్తి తీర్పులో పేర్కొన్నారు.