‘మా భూములు ఇవ్వలేం’
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:22 AM
ఐటీ పార్కులకు, ప్రైవేటు సంస్థల కోసం చేపడుతు న్న భూసేకరణ నుంచి భోగాపురం తూర్పు, పడమర ఖండాలను మినహాయించాలని ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు కోరారు.
భోగాపురం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఐటీ పార్కులకు, ప్రైవేటు సంస్థల కోసం చేపడుతు న్న భూసేకరణ నుంచి భోగాపురం తూర్పు, పడమర ఖండాలను మినహాయించాలని ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు కోరారు. భోగాపురంలోని జాతీయ రహదారి సమీపంలో చేపడుతున్న నిరసన వేదిక వద్ద వారు శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. భూసేకరణను అడ్డుకోవడానికి గత 20 రోజులుగా నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. ఎయిర్ పోర్టుకు 900 ఎకరాలు ఇచ్చామన్నారు. ఇంకా ఇవ్వడానికి రైతుల వద్ద భూములు లేవన్నారు. దీనిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.