Soldiers సైనికుల త్యాగాలు మరువలేం
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:45 PM
We Can Never Forget the Sacrifices of Our Soldiers దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలను మరువలేమని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.మాధురి అన్నారు. సరిహద్దుల్లో వారు చూపై ధైర్య సాహసాలు, దేశం కోసం చేసే పోరాటాలు చిరస్మరణీయమని తెలిపారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో మాజీ సైనికులకు శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
బెలగాం, జూలై25(ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలను మరువలేమని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.మాధురి అన్నారు. సరిహద్దుల్లో వారు చూపై ధైర్య సాహసాలు, దేశం కోసం చేసే పోరాటాలు చిరస్మరణీయమని తెలిపారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో మాజీ సైనికులకు శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయాన్ని గుర్తు చేశారు. పాకిస్థాన్ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టారన్నారు. భారత జవాన్లు ప్రాణాలు పణంగా పెట్టి శత్రుమూకలను ఏరిపారేశారని తెలిపారు. సైనికుల త్యాగాలను దేశం ఎల్లప్పుడూ గుర్తించుకుంటుందన్నారు. మాజీ సైనికులు కోసం నాల్సా ప్రవేశపెట్టిన వీర్ పరివార్ సహాయత పతకం గురించి వివరించారు. ఉచిత న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 15100 వినియోగించుకోవాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో అడిషన్ జ్యుడీషియల్ మేజిస్ర్టేట్ జె.సౌమ్యజోస్పిన్, పార్వతీపురం సీఐ బి.వెంకటరావు, మాజీ సైనికుల ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
సబ్ జైలు తనిఖీ
పార్వతీపురం సబ్ జైలును రెండో అదనపు జిల్లా న్యాయాధికారిచ జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు ఎం.మాధురి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు చట్టాలపై ఖైదీలకు అవగాహన కల్పించారు. ఖైదీలపై వివక్ష చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్‌జైలులో కొనసాగుతున్న జైలు లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను తనిఖీ చేశారు. న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్ల విధులపై ఆరా తీశారు. అనంతరం జైలులోని వంటగది, భోజనశాల, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. వంట సరుకులు, పప్పు దినుసులను పరిశుభ్రంగా నిల్వ చేయాలన్నారు. ఈ పరిశీలనలో సబ్‌జైలు సూపరింటెండెంట్ జి.రాము, జైలు సిబ్బంది ఉన్నారు.