Share News

Sampoorna Abhiyan సంపూర్ణ అభియాన్‌ 2.0 అమలులో మనమే ఫస్ట్‌

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:32 AM

We are the first in implementing Sampoorna Abhiyan 2.0 సంపూర్ణ అభియాన్‌ 2.0 కార్యక్రమం అమలులో మన్యం జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్య, స్ర్తీ శిశు సంక్షేమ , పశు సంవర్థక, విద్య, పంచాయతీరాజ్‌ శాఖల విభాగంలో శత శాతం సాచ్యు రేషన్‌ సాధించినట్లు వెల్లడించారు.

 Sampoorna Abhiyan  సంపూర్ణ అభియాన్‌ 2.0 అమలులో మనమే ఫస్ట్‌
జిల్లా ప్రథమ స్థానం సాధించిన బ్యానర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌ తదితరులు

పార్వతీపురం, ఏప్రిల్‌13(ఆంధ్రజ్యోతి): సంపూర్ణ అభియాన్‌ 2.0 కార్యక్రమం అమలులో మన్యం జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్య, స్ర్తీ శిశు సంక్షేమ , పశు సంవర్థక, విద్య, పంచాయతీరాజ్‌ శాఖల విభాగంలో శత శాతం సాచ్యు రేషన్‌ సాధించినట్లు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ‘ సంపూర్ణ అభియాన్‌ 2.0 కార్యక్రమం నిర్వహణలో మన్యం జిల్లాకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ప్రతిఒక్కరు విధులు నిర్వ హించాలి. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరే విధంగా కృషి చేయాలి. ఏ విషయంలోనూ జిల్లా వెనుకబడి ఉండడానికి వీలులేదు.’ అని తెలిపారు. అనంతరం పలు శాఖల అధికారులను ఆయన అభినందించారు. జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి , సబ్‌ కలెక్టర్లు వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్‌వో హేమలత తదితరులను దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి కలెక్టర్‌ స్వయంగా పంచిపెట్టారు. అన్ని రంగాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలి పేందుకు కృషిచేస్తున్న కలెక్టర్‌ను జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్ర మంలో డీఎంహెచ్‌వో భాస్కరరావు, పశుసంవర్థక శాఖ అధికారి మన్మఽథరావు, డీఈవో బ్రహ్మాజీరావు, డీపీవో కొండలరావు, ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

మహిళా సాధికారితకు అడుగులు

పార్వతీపురం, ఏప్రిల్‌13(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారితకు మరింత బలమైన అడుగులు వేస్తున్నామని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బల పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నారీశక్తి వందన్‌ సమ్మేళనంలో భాగంగా సోమవారం కలెక్టర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. పరిశుభ్రత, ఆహ్లాదకర వాతావరణానికి పెద్దపీట వేయాలి. కేంద్రాలను కాన్వెంట్లుగా మార్చాలి. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా వారిని తీర్చి దిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. స్వయం సహాయక సంఘాలు ఆదాయ వనరులను పెంచుకోవాలి.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీవోలు కె.విజయగౌరి, రజని, దుర్గ, సుగుణకుమారి, జిల్లా బాలల రక్షణ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని మంగళవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 14న ఉదయం 9 గంటలకు జిల్లా ఆసుపత్రి జంక్షన్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలుమాలలు వేసి నివాళి అర్పించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి జయంతి సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Updated Date - Apr 14 , 2026 | 12:32 AM