Share News

పది రోజులు సేవలు నిలిపేస్తున్నాం

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:16 AM

తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరం కుశ వైఖరికి నిరసనగా పది రోజులపాటు సేవల ను నిలిపివేస్తున్నామని దస్తావేజు లేఖర్లు స్పష్టం చేశారు.

పది రోజులు సేవలు నిలిపేస్తున్నాం

  • దస్తావేజు లేఖరుల స్పష్టీకరణ

చీపురుపల్లి, జూలై 16(ఆంధ్రజ్యోతి): తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరం కుశ వైఖరికి నిరసనగా పది రోజులపాటు సేవల ను నిలిపివేస్తున్నామని దస్తావేజు లేఖర్లు స్పష్టం చేశారు. చీపురుపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట వారు గురువారం నిరస న చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ ఈనెల 20 నుంచి 31 వరకూ సేవలు నిలిపివేస్తున్నట్టు తెలిపా రు. జీవో నెంబర్‌ 396 రద్దు చేసే వరకూ తమ పోరాటం ఆగదన్నారు. అనంతరం వారు సబ్‌ రిజిస్ట్రార్‌ టీకేవీ లక్ష్మణరావుకు వినతిపత్రం సమర్పిం చారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు గంట్యాడ పోతన్న, కుప్పిలి కాశీ, గంట్యాడ బుజ్జి, గంట్యాడ విష్ణు, ఎలకల సూరిబాబు, షణ్ముఖ, వారి సహాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:16 AM