గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడుతున్నాం
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:28 AM
మండాకురిటి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో ఆ గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.
సంతకవిటి, జూన్ 21(ఆంధ్రజ్యో తి): మండాకురిటి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో ఆ గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. మండ లంలో అతిపెద్ద గ్రామమైన మండాకురిటిలో గుక్కెడు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ట్యాంకు శిథిలావస్థకు చేరు కోవడం.. నేలబావి చెత్తచెదారంతో నిండిపోవడంతో తాగునీటికి అనువుగా లేకుండా పోయిందని తెలిపారు. దీనివల్ల ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ గ్రామంలో తాగునీటి సమ స్య మాత్రం పరిష్కారం కాలేదని గ్రామస్థులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.