రైతులకు భూ హక్కులు కల్పిస్తున్నాం
ABN , Publish Date - May 06 , 2026 | 12:19 AM
గత ప్రభుత్వనిర్లక్ష్యం వల్ల రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయారని, వారికి మళ్లీ హక్కులు కల్పిస్తున్నామని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
ఎస్.కోట ఎమ్మెల్యే లలితకుమారి
కొత్తవలస, మే 5(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వనిర్లక్ష్యం వల్ల రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయారని, వారికి మళ్లీ హక్కులు కల్పిస్తున్నామని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. మంగళవారం చీడివలస గ్రామంలో రైతులకు ఆమె పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. తహసీల్దార్ రమాలక్ష్మి, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, కొత్తవలస పీఏసీఎస్ అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బొబ్బిలి అప్పారావు, టీడీపీ నాయకులు కనకాల శివ, బంగారు రమేష్, గొంప దుర్గా ఉమేష్, తాజా మాజీ చీడివలస సర్పంచ్ సీహెచ్ అప్పలనాయుడు పాల్గొన్నారు.