భూములిచ్చేది లేదు
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:25 AM
చావడానికైనా సిద్ధంగా ఉన్నామని.. ఎట్టి పరిస్థితుల్లో డేటా సెంటర్‌కి భూములిచ్చేది లేదని భోగాపురం రైతులు స్పష్టంచేశారు.
భోగాపురం, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): చావడానికైనా సిద్ధంగా ఉన్నామని.. ఎట్టి పరిస్థితుల్లో డేటా సెంటర్‌కి భూములిచ్చేది లేదని భోగాపురం రైతులు స్పష్టంచేశారు. ఈ మేరకు శుక్రవారం వారు స్థానిక పంచాయతీ కార్యాలయం సమీపంలో గాంధీ విగ్రహానికి వినతిప త్రం అందజేసి.. అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అలాగే పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి డీడీ స్వరూపరాణి గ్రామ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. ఆ గ్రామ సభను బహిష్కరించారు.