అభివృద్ధి చేస్తున్నాం.. ఆదరించండి
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:08 AM
పల్లెల అభివృద్ధే ప్రధాన ధ్యేయం గా పనిచేస్తున్న టీడీపీని ఆదరించి గెలిపించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు.
మంత్రి శ్రీనివాస్
బొండపల్లి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధే ప్రధాన ధ్యేయం గా పనిచేస్తున్న టీడీపీని ఆదరించి గెలిపించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. సోమవారం ఆయన జె.గుమడాం గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి పాశల నీరజ, ఎంపీటీసీ అభ్యర్థి లంక వెంకటలక్ష్మిలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అలాగే ఎం.కొత్తవలస, మరువాడ గ్రామాల్లో కూటమి మద్దతుతో పోటీలో నిలిచిన దాసరి అశోక్‌ను పరిచయం చేస్తూ ప్రచారం చేశారు. అలాగే జడ్పీటీసీ అభ్యర్థి సొంత గ్రామమైన దేవుపల్లిలో ఎంపీటీసీ అభ్యర్థి గంట సరోజనిని పరిచయం చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రాపాక అచ్చంనాయుడు, టీడీపీ నాయకుడు కర్రోతు శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్చార్జి డోకుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మీ మనవరాలు పావనిని ఆశీర్వదించండి..
గజపతినగరం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రెడ్డి పావని మీ ఊరి మనవరాలు. ఈరోజు మీ ముందుకు వచ్చింది. ఆశీర్వదించి అత్యధిక ఓట్లతో గెలిపించండి’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. సోమవారం ఆయన మండ లంలోని కొత్తబగ్గాం, కాళంరాజపేట గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కొత్తబ గ్గాంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మా ట్లాడుతూ.. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గ్రామంలో తనకు 400 ఓట్లు మెజార్టీ ఇచ్చారని, అదేవిధంగా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీ తీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి రెడ్డి పావని, పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, ఎంపీటీసీ అభ్యర్థులు లెంక చంద్రినాయుడు, తదితరులు పాల్గొన్నారు.