Share News

తాగునీటికి అవస్థలు పడుతున్నాం

ABN , Publish Date - May 15 , 2026 | 12:26 AM

గత 15 రోజులుగా తాగునీటికి అవస్థలు పడుతున్నాం.. ఏ అధికారీ పట్టిం చుకోవడం లేదని డీకొల్లం గ్రామ మహిళలు ఎమ్మెల్యే లోకం నాగమాధవి వద్ద ఏకరువుపెట్టారు.

తాగునీటికి అవస్థలు పడుతున్నాం

  • ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టిన డీకొల్లం మహిళలు

డెంకాడ, మే 14(ఆంధ్రజ్యోతి): గత 15 రోజులుగా తాగునీటికి అవస్థలు పడుతున్నాం.. ఏ అధికారీ పట్టిం చుకోవడం లేదని డీకొల్లం గ్రామ మహిళలు ఎమ్మెల్యే లోకం నాగమాధవి వద్ద ఏకరువుపెట్టారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి గురువారం గుణుపూరుపేట గ్రా మంలో ఓ కార్యక్రమానికి రాగా, డీకొల్ల మహిళలు రోడ్డుపై ఆమె వాహనాన్ని చుట్టుముట్టారు. గత 15 రోజులుగా తాగునీటికి అనేక అవస్థలు పడుతున్నామని, ఏ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. మండలంలోని డి.కొల్లం, ముగినపల్లి, గుణుపూర్‌పేట, డెంకాడ, పినతాడివా డ, పెదతాడివాడ తదితర గ్రామాల ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటు న్నారని చెప్పారు. సంబంధిత అధికారు లకు, నాయకులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15 గ్రామాల ప్రజలకు సుమారు రెండు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - May 15 , 2026 | 12:26 AM