రైతు సేవకు కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:08 AM
రైతుల సేవకు కూటమి ప్రభుత్వం కట్టుబ డి ఉందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.
ఎస్.కోట ఎమ్మెల్యే లలితకుమారి
లక్కవరపుకోట, అక్టోబరు 8(ఆంధ్ర జ్యోతి): రైతుల సేవకు కూటమి ప్రభుత్వం కట్టుబ డి ఉందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. గురువా రం మార్లాపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని.. ఆరు గ్రామాలకు చెందిన 5,331 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కరెడ్ల ఈశ్వరావు, చొక్కాకుల మల్లునాయుడు, కొల్లు రమణమూర్తి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ఒబ్బిన సత్యనారాయణ, తహసీల్దార్ పి.హరి పాల్గొన్నారు.