అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:29 AM
కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.
రాజాం ఎమ్మెల్యే కోండ్రు
రేగిడి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. సంకిలిలో రూ.30లక్ష ల అంచనాతో నిర్మించిన హెల్త్‌క్లినిక్‌ను ఆయన శుక్రవా రం ప్రారంభించారు. పార్టీ నాయకులు బుచ్చిబాబు, గురువాన నారాయణరావు, పి.రామినాయుడు, కిమిడి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. అలాగే టీడీపీలో చేరిన సంకిలి మాజీ సర్పంచ్ బుడిమూరి పట్టాభితో పాటు 30 కుటుంబాలను ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.
రాజాం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తు న్నట్టు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు. శ్యాంపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కార్యకర్తే అధినేత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం టీడీపీలోకి చేరిన రేగిడి మండలం ఉంగరాడ గ్రామానికి చెందిన 50 వైసీపీ కు టుంబాలను ఆయన కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం 59 మంది లబ్ధిదారులకు రూ.36లక్షల 65వేల 774 సీఎం సహాయనిధి చెక్కుల ను పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు కొల్ల అప్పలనా యుడు, పార్టీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకాష్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు సుమల వెంకట మన్మ థరావు తదితరులు పాల్గొన్నారు.
రహదారి బాగు చేయాలని వినతి
సంతకవిటి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవిందపురం-మందరాడ గ్రామాల మధ్య సుమారు 3 కిలోమీటర్ల రహదారి సుమారు 15 ఏళ్లగా గుంతల మయంగా ఉందని.. దీనిని బాగు చేయాలని ఆయా గ్రామస్థులు ఎమ్మెల్యే మురళీమోహన్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం రాజాంలో నిర్వహించిన ప్రజాదర్బా ర్‌లో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు, రాజాం వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లూరు గణేష్, టీడీపీ మండల అధ్యక్షుడు గట్టి భాను, సంతకవిటి పీఏసీఎస్ చైర్మన్ మహేష్‌కుమార్, సమతం శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.