Share News

We are coming వచ్చేస్తున్నాం

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:18 AM

We are coming జిల్లా మత్స్యకారులు వచ్చేస్తున్నారు. సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. బంగ్లాదేశ్‌లో బందీలైన వారు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే.

We are coming వచ్చేస్తున్నాం
బంగ్లాదేశ్‌లో బోటు ఎక్కుతున్న దేరిన జిల్లా మత్స్యకారులు.

వచ్చేస్తున్నాం

బంగ్లాదేశ్‌ నుంచి బయలుదేరిన మత్స్యకారులు

నేటి ఉదయం బంగ్లా బోర్డర్‌ దాటే అవకాశం

భోగాపురం, జనవరి28(ఆంధ్రజ్యోతి): జిల్లా మత్స్యకారులు వచ్చేస్తున్నారు. సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. బంగ్లాదేశ్‌లో బందీలైన వారు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. భోగాపురం పూసపాటిరేగ మండలాలకు చెందిన మరుపల్లి చిన్నఅప్పన్న, మరుపల్లి రమేష్‌, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్‌, సురపతి రాము, అప్పలకొండ, నక్కా రమణ, వాసపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్న తదితరులు బుధవారం సముద్ర మార్గాన బోటుపైనే భారతదేశానికి బయలుదేరారు. అయితే బంగ్లాదేశ్‌ కోస్టుగార్డు ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌, భారత్‌ సముద్రజలాల మధ్య బోర్డర్‌గా ఉన్న సుందర్‌బన్‌ సమీపంలో బోర్డర్‌ దాటనున్నారని తెలిసింది. అక్కడే ఇండియా మత్స్యకారులను భారత్‌ కోస్టుగార్డుకు, బంగ్లాదేశ్‌ మత్స్యకారులను బంగ్లాదేశ్‌ కోస్టుగార్డుకు గురువారం ఉదయం సుమారు 7నుంచి 9 గంటల మధ్య అప్పగించుకోనున్నారు. అనంతరం మన మత్స్యకారులను ఇండియా కోస్టుగార్డ్సు విశాఖపట్నం తీసుకురానున్నారు. సముద్రమార్గాన ఈనెల31న లేదా వచ్చేనెల 1వతేదీన విశాఖ చేరనున్నారు.

Updated Date - Jan 29 , 2026 | 12:18 AM