Thotapalli తోటపల్లిలో నీటి నిల్వలు తగ్గుముఖం
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:29 PM
Water Storage Declines in Thotapalli తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో రోజురోజుకీ నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు ఎగువ ప్రాంత నుంచి పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. దీంతో నిత్యం జలకళతో ఉట్టిపడే తోటపల్లి అడుగంటుతుంది.
గరుగుబిల్లి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో రోజురోజుకీ నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు ఎగువ ప్రాంత నుంచి పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. దీంతో నిత్యం జలకళతో ఉట్టిపడే తోటపల్లి అడుగంటుతుంది. నాగావళి నది మధ్య భాగంలో దిబ్బలు దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను ప్రస్తుతం 102.25 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ఎండలు ముదిరితే ఈ నిల్వలు మరింత తగ్గనున్నాయి. పైనుంచి ప్రాజెక్టులోకి 35 క్యూసెక్కులు చేరగా, నదిలోకి 90 క్యూసెక్కులను విడుదల చేశారు. పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ ప్రధాన కాలువ నుంచి 200 క్యూసెక్కులు, కుడి కాలువ నుంచి 60 క్యూసెక్కులను దిగువ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త రెగ్యులేటర్ పరిధిలో కుడి ప్రధాన కాలువ నుంచి సాగునీరు సరఫరా నిలుపుదల చేశారు. కాగా ఇదే పరిస్థితి కొనసాగితే ఖరీఫ్‌కు సాగునీటి కష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రాజెక్టు జేఈ శ్రీనివాసరావును వివరణ కోరగా.. వర్షాలతో పాటు పై ప్రాంతం నుంచి నీటి ప్రవాహం వస్తే ఖరీఫ్ సాగుకు ఇబ్బంది ఉండదని తెలిపారు.