Water or Poison? జలమా.. గరళమా?
ABN , Publish Date - May 25 , 2026 | 12:00 AM
Water or Poison? ప్రజల గొంతు తడపాల్సిన నీరు గరళంగా మారుతోంది. శంబర గ్రామంలోని కుళాయిల నుంచి మురుగునీరు సరఫరా కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నీరు తాగేందుకేనా? తమకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
మక్కువ రూరల్, మే24(ఆంధ్రజ్యోతి): ప్రజల గొంతు తడపాల్సిన నీరు గరళంగా మారుతోంది. శంబర గ్రామంలోని కుళాయిల నుంచి మురుగునీరు సరఫరా కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నీరు తాగేందుకేనా? తమకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో పైపులైన్ పాడవడంతో కాలువలోని మురుగునీరు కుళాయి నీటిలో కలుస్తుండడమే ఈ పరిస్థితికి కారణమని వారు వాపోతున్నారు. కాగా గ్రామంలోని బీసీ కాలనీ, యాదవ వీఽధి జంక్షన్‌లో గత రెండు రోజుల నుంచి కుళాయిల నుంచి మురుగునీరు సరఫరా అవుతున్నా.. సంబంఽధిత అధికారులు స్పందించడం లేదు. దీంతో ఆయా ప్రాంతవాసులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు గ్రామంలో ఉన్న బోర్లు నుంచి కూడా సక్రమంగా నీరు రాకపోక పోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని శంబర గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ జోగారావును వివరణ కోరగా.. మరమ్మతులు చేపట్టి మురుగు నీటి సరఫరా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.