Share News

తగ్గిన మడ్డువలస నీటి మట్టం

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:18 AM

గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువ లస రిజర్వాయర్‌ నీటి మట్టం గణనీయంగా పడిపోవండంతో నాలుగు మండలాల రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

తగ్గిన మడ్డువలస నీటి మట్టం

  • ఆయకట్టు రైతుల్లో ఆందోళన

వంగర , ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువ లస రిజర్వాయర్‌ నీటి మట్టం గణనీయంగా పడిపోవండంతో నాలుగు మండలాల రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి తీవ్ర స్థాయిలో నీరు తగ్గిపోవటం పంటసాగుపై తీవ్ర ప్రభావం చూపైలా ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 65 మీటర్లు కాగా ప్రస్తుతం 61.5 మీటర్లకు తగ్గింది. అంతేకాకుండా ప్రవాహం సెకండుకు 30 క్యూసెక్కులు చొప్పున వేగంగా పడిపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారులు స్పందించి నీటి మట్టం మరింత పడిపోకుండా వెంటనే చర్యలు చేపట్టాలని, ప్రోజెక్టు గేట్లు నిర్వహణ ను పరిశీలించాలని, మిగిలిన నీటిని సమర్థవంతంగా పంటలకు సరఫరా చేసేలా రోటేషన్‌ విధానాన్ని అమలు చేయాలని ఆయకట్టు రైతులు అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో పెట్టుబడులు కూడా దక్కవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 17 , 2026 | 12:18 AM