నీటి సంరక్షణ తప్పనిసరి
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:15 AM
జిల్లాలోని ప్రతి కార్యాలయం, విద్యా సంస్థ, అంగన్వాడీ కేంద్రాల్లో నీటి సంరక్షణ తప్పనిసరిగా చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు.
పార్వతీపురం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి కార్యాలయం, విద్యా సంస్థ, అంగన్వాడీ కేంద్రాల్లో నీటి సంరక్షణ తప్పనిసరిగా చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌ఏఎస్‌ఏ, జలధార పనులపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచా యతీ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రా లు, వెటర్నరీ ఆసుప త్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రతి ప్రభుత్వ భవనంలో జల సంరక్షణ పనులను ప్రారంభించారు. ఇంకుడు గుంతలు తవ్వడం లేదా పైకప్పు నీటి సంరక్షణ నిర్మాణాలు తప్పనిసరిగా చేపట్టా లన్నారు. ఎంపీడీవోలు తమ పరిధిలోని ప్రభుత్వ కార్యా లయాల జాబితాను సిద్ధం చేసుకోవాలన్నారు. ఏపీవోలు, ఎంపీడీవోలు, సమన్వయం చేసుకొని పనులకు అవసర మైన కూలీలను కేటాయించాలన్నారు. పనులు ప్రారం భించే ముందు మార్కింగ్ ఇచ్చి ఆ ఫొటోలను సాయం త్రం ఐదులోగా యంత్రాంగానికి పంపాలని ఆదేశించారు.
ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలపై హర్షం
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో ఫస్టియర్‌లో ఐదో స్థానం, సెకండియర్‌లో నాలుగో స్థానంలో నిలవడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలకు కృషి చేసిన అధ్యాపకులు, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు వెళ్లాలని, కనీసం నెలకు లక్ష రూపాయలు సంపా దించే స్థాయికి ఎదగాలని అన్నారు. రాబోయ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశా లలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖా ధికారి వై.నాగేశ్వరరావు, వివిధ ప్రభుత్వ కళాశా లలు, కేజీబీవీల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాము లు కావాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు పిలుపుని చ్చారు. పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా కలెక్టరేట్ ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వ హించారు. కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. మారు తున్న వాతావరణ పరిస్థితుల్లో భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.