రోడ్డు ప్రమాదంలో వాచ్‌మన్ మృతి
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:55 PM
బాలేరు పీహెచ్‌సీలో వాచ్‌మన్‌గా పని చేస్తున్న సీహెచ్‌శంకర్(28) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
భామిని, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): బాలేరు పీహెచ్‌సీలో వాచ్‌మన్‌గా పని చేస్తున్న సీహెచ్‌శంకర్(28) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు, 108 వాహన సిబ్బంది కథనం మేరకు.. శంకర్ కొత్తూరు నుంచి బాలేరు ద్విచక్రవాహనంలో వస్తుండగా అత్తికొత్తూరు సమీపంలో నాటు బండికి ఢీకొట్టాడు. అక్కడి సృహ తప్పిపోవడంతో స్థానికులు సమాచారం మేరకు 108 వాహనంలో సీతంపేట తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందా డు. బిటివాడ గ్రామానికి చెందిన శంకరరావు ఐదేళ్లుగా బాలేరు పీహె చ్‌సీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారని వైద్యాధికారి శివకుమార్ తెలిపారు.