రాజాంలో రూ.1.60కోట్లతో చెత్త సంపద కేంద్రం
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:08 AM
రాజాంలో చెత్తసంపద కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.1.60కోట్లు మంజూరు చేసిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.
- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
రాజాం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): రాజాంలో చెత్తసంపద కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.1.60కోట్లు మంజూరు చేసిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. రాజాం మున్సిపాలిటీ పరిధి జెండా దిబ్బ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డును ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజాం మున్సిపాలిటీలో చెత్తలేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చెత్తసంపద కేంద్రం పనులను మే నెలలో ప్రారంభించి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ రామచంద్రరావును ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు, నా యకులు కోండ్రు జగదీష్, వంగా వెంకటరావు, గురవాన నారాయణరావు, దుప్పల పూడి శ్రీనివాసరావు, పిల్లా సత్యంనాయుడు, శాసపు రమేష్‌కుమార్, ముగడ శ్రీనివా సరావు, మాడుగుల జయరాం, దూబ ధర్మారావు, పొన్నాడ భీమేశ్వరరావు పాల్గొన్నారు.