Share News

చెత్తను వేరుచేసి ఇవ్వాలి: డీఎల్‌పీవో

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:57 PM

ప్రతిరోజూచెత్తబండికి తడిపొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని మహిళలకు డీఎల్‌డీవో హేమసందరరావు సూచించారు.

 చెత్తను వేరుచేసి ఇవ్వాలి: డీఎల్‌పీవో
పొగిరిలో చెత్తను తీయిస్తున్న హేమసందరరావు:

రాజాం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ప్రతిరోజూచెత్తబండికి తడిపొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని మహిళలకు డీఎల్‌డీవో హేమసందరరావు సూచించారు. బుధవారం మండలంలోని పొగిరిలో స్వచ్ఛపఽథం కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారిపై చెత్తను తొలగించి సంపద కేంద్రానికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రోడ్లు నిర్మాణానికి నిధుల మంజూరుకు చర్యలు : కమిషనర్‌

కొత్తవలసలో పాడైన కాలువలు, రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మునిసిపల్‌ కమిషనర్‌ ఎ.రామచందరరావు తెలిపారు. బుధవారం కొత్తవలసలో టీడీపీ నాయకులు, మునిసిపల్‌ సిబ్బందితో కాలువలు, రోడ్లు పరిశీలించారు. కాలువలు, రోడ్లకు సంబంధించి ఎంత నిధులు అవసరమో అంచనాలు తయారు చేయాలని ఏఈని ఆదేశించారు.

Updated Date - Jul 08 , 2026 | 11:57 PM