వార్డుల పునర్విభజన సక్రమంగా లేదు
ABN , Publish Date - May 23 , 2026 | 11:46 PM
పట్టణంలోని వార్డుల పునర్విభజన సక్రమంగా లేదని సీపీఐ నేతలు కూరంగి మన్మఽథరావు, బుడితి అప్పల నాయుడు, బుడి భారతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగర పం చాయతీ కమిషనర్ రత్నంరాజుకు వినతిపత్రాన్ని శనివారం అందించారు.
పాలకొండ, మే 23 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వార్డుల పునర్విభజన సక్రమంగా లేదని సీపీఐ నేతలు కూరంగి మన్మఽథరావు, బుడితి అప్పల నాయుడు, బుడి భారతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగర పం చాయతీ కమిషనర్ రత్నంరాజుకు వినతిపత్రాన్ని శనివారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాస్ర్తీయ విభజన కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేథావులు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఖచ్చితమైన జాబితా లేకుం డాపోయిందన్నారు. అలాగే నగర పంచాయతీ కమిషనర్‌కు వార్డుల విభజనపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ వినతిపత్రాన్ని సమర్పించారు.