Walking 5 Kilometers… 5 కిలోమీటర్లు నడిచి.. రాళ్లు రప్పలు దాటి..
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:24 AM
Walking 5 Kilometers… Crossing Stones and Rough Terrain… గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. ప్రధానంగా రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వేళల్లో వైద్య సేవలు పొందేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.
భామిని, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. ప్రధానంగా రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వేళల్లో వైద్య సేవలు పొందేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. భామిని మండలం కోటకొండకు చెందిన పాలక సుమంతో సోమవారం ఉదయం స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో గ్రామానికి చెందిన యువత డోలీ కట్టారు. సుమంతోను మోసుకుంటూ.. సుమారు ఐదు కిలోమీటర్ల మేర రాళ్లు తేలి దారిలో నడుచుకుని.. కాయమానుగూడ జంక్షన్‌కు చేరుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో సుమంతోకు స్పృహ రావడంతో తండ్రి రాజారావుతో గిరిజన యువత ఊపిరిపీల్చుకున్నారు. తిరిగి వారు గ్రామానికి చేరుకున్నారు. అయితే తివ్వకొండ శిఖర గ్రామాలైన కోటకొండ, కోసింగూడకు రహదారి లేకపోవడంతో గ్రామస్థుల్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా.. డోలీ మోతలు తప్పడం లేదని వారు వాపో యారు. దీనిపై సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు వేడుకున్నారు.